అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు లేతాకుపచ కోరుకుంటారని నిపుణుల గాఢమైన నమ్మకం. కలర్ థెరపిస్ట్లు ఈ  రంగు ఆందళోనననీ డిప్రెషన్ నీ తగ్గిస్తుందంటారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్య సాచి డిజైన్ చేసిన చీరలు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ సారీస్ మింట్ క్రిస్టల్ చివరకు రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ క్రియేట్ చేసిన దానికి తప్పనిసరిగా ఎక్కడో గ్రీన్ కలర్ ఎట్టాచ్డ్ గా వుంటాయి. మొత్తం ఇమేజెస్ అన్నీ చూపిన ప్రతి చీరకు ఏదో రకంగా హరితవర్ణ సోయగం మిక్స్ అవ్వకుండా వుండదు. దీపికా పదుకునే విద్యా బాలన్ కంగనా రనౌత్ వంటి తారలు కట్టుకుని  తళుక్కున మెరిసిన చీరల్లో కూడా ఈ ఆకుపచ్చని ఛాయలే ఎక్కువ సిరిసంపదలకు ప్రతీకగా నిలిచే ముదురాకు పచ్చ లేదా గడ్డి రంగు అర్థం విశ్వాసాన్ని పెంచచే  రంగులే.

Leave a comment