కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50 శాతం నుంచి 90 శాతం మందికి దృష్టి  సంబంధ మైన సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కంప్యూటర్ నుంచి వచ్చే వెలుగులు కళ్ళు అలసి పోవటానికి కారణం అవుతున్నాయి. అందుకే ఆఫీసైనా ఇల్లయినా  కంప్యూటర్ ముందు కూర్చునే చోట తగినంత వెలుతురు  ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ తెరను కూడా వెలుతురు  కాస్త తగ్గించుకోవాలి. అక్షరాలూ మరీ చిన్నవిగా ఉంటే అప్పుడు దృష్టి  అంతా అక్కడే పెట్టాల్సివస్తుంది. అంచేత అక్షరాలు కాస్త సైజు పెంచుకోవాలి. అప్పుడు కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండాలి. అప్పుడే కళ్ళకు కావలిసినంత తేమ అందుతుంది. కళ్ళు అలసి పోకుండా ఉంటాయి. అలాగే కూర్చునే కుర్చీ కూడా వెన్నుముక్క అనే విధంగా ఉంటే పోశ్చర్ సరిగ్గా ఉంటుంది. ఇంకా ఫోన్ ల విషయంలో కాస్తంత విరామం ఇస్తూ ఉండదంటున్నారు నిపుణులు.

Leave a comment