అందరికీ అందమైన ఆధునికమైన నగలు చాలా ఇష్టం.వాటిని భద్రపరిచే పెట్టెలు కూడా అందంగా కనబడితే బాగుంటుందనే ఉదేశ్యంతో తయారు చేశారు డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు.ఇవి కేవలం నగల పెట్టలేక కాదు అలంకరణ వస్తువులు లాగా కూడా ఉపయోగపడతాయి డ్రెస్సింగ్ టేబుల్ పైనా షోకేస్ లోను పెడితే చక్కగా ఉంటాయి. ఎంతో అందమైన రంగుల్లో రంగు రాళ్ళు పొదిగిన ఈ డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు ఎన్నో చక్కని రూపాల్లో కనిపిస్తున్నాయి రథం, పడవ, స్ట్రాబెర్రీ, పూలబుట్ట, నెమలి వంటి రూపాల్లో డిజైనర్ బాక్సులు ఎంతో అందంగా ఉన్నాయి.

Leave a comment