పైలట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ వివిధ రంగాలకు చెందిన ఆరుగురు మహిళలకు గగన యాత్రకు తీసుకు వెళ్తుంది. నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయేషా బోవ్‌ శాంతి బహుమతి నామినేట్ అయిన అమండా గుయెన్ రచయిత్రి లారెన్ సాంచెజ్,ఉత్తమ రేడియో టాక్ షో ఎక్స్పర్ట్ గేల్ కింగ్,పాప్ స్టార్ కేటీ పెర్రీ సబ్ ఆర్బిటాల్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు.ఈ స్పేస్ క్రాఫ్ట్ 11 నిమిషాల పాటు భూమికి 62 మైళ్ళ ఎత్తులో ఉన్న కర్మాన్ రేఖను దాటి అంతరిక్ష ప్రవేశ ద్వారం వరకు ప్రయాణిస్తుంది.ఈ క్యాప్సూల్ వంటి  అంతరిక్ష నౌక ద్వారా ఈ ఆరుగురు మహిళలు భూమి విహంగ వీక్షణ ను ఆస్వాదిస్తారు.

Leave a comment