Categories

అంతరిక్ష యాత్ర చేసే అవకాశం దక్కించుకుంది జాహ్నవి దంగేటి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన జాహ్నవి ఆస్ట్రోనాట్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంది. 2023 లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశం తెచ్చుకుంది అక్కడ సిమ్యులేషన్స్, ఫ్లైట్ ఎక్సర్ సైజెస్, మిషన్ డ్రిల్స్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా జాహ్నవి ఎంపికైంది. దీనికోసం మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది అనంతరం 2029 లో 5 గంటల పాటు ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణం చేయనున్నది. భవిష్యత్తులో అంగారకుడిపై అడుగుపెడతానని చెబుతుంది జాహ్నవి.