ఈ ప్రపంచంలో ఎన్నో అందమైనవి అద్భుతమైనవి ఉన్నాయి. ప్రపంచంలోకెల్ల ఎంతో ఎత్తున ఉన్న సరస్సు మనదేశంలో ఉంది. సిక్కింలోని గురుడాన్ మార్ సరస్సు సముద్రమట్టానికి 5,425 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక్కడకి వెళ్ళాలంటే సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ నుంచి 12 గంటల కఠినకరమైన రోడ్డులో వెళ్ళాలి చుట్టు మంచు పర్వతాలు మధ్యలో ఈ సరస్సు ఉంటుంది. ఒక గంటసేపు కూడా ఇక్కడ గడవడం కష్టం చలి కాలం సరస్సు గడ్డ కట్టుకుపోతుంది. మిగిలిన సమయంలో అక్కడ అపురూపంగా పెరిగే ఆల్గే మొక్కలు ఈ నీళ్ళలో ప్రతిఫలించి ఆ సరస్సు అద్భుతంగా వెలిగిపోతుంది.

Leave a comment