Categories
చూపు లేకపోయినా భూమిక సుదర్శన్ చక్కగా రుచిగా వంట చేయగలరు భూమిక సుదర్శన్. ఈమె యూట్యూబ్ ఛానల్ భూమిక కిచెన్ కు 80 వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. 1300 పైగా వంటలు పోస్ట్ చేశారు భూమిక. బ్యాచిలర్స్ సులభంగా వండుకో గలిగే వంటలే పోస్ట్ చేస్తారు భూమిక సుదర్శన్. 35 ఏళ్ల వయసులో అరుదైన చూపు పోయినా భూమిక డిప్రెషన్ లోకి కూరుకుపోకుండా ఈ వంటల వీడియోలు చేయటం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. భూమిక కిచెన్ భారతదేశంలో అంధురాలైన ఒక మహిళ ప్రారంభించిన తొలి యూట్యూబ్ ఛానల్.