సాధారణంగా ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఇంట్లో ఎప్పుడో వాడి మిగిలిపోయినా మందులు బయటికి తీసి వాడుతూ ఉంటారు.వాటి వల్లనూ,ముఖ్యంగా యాంటీబయోటిక్స్ మళ్ళీ వినియోగిస్తే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. పిల్లలకు కాటుక,సబ్బులు అలా సగం వాడి మూలన పడేసి యాంటీ బయోటెక్స్ ను వైద్యుల సలహా లేకుండా ఇస్తే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. కొన్ని వందల మంది పై ఈ విషయం గురించి పరిశోధన చేస్తే అందులో 43.2శాతం మంది పాత యాంటీ బయోటెక్స్ ను ఇంట్లో కుటుంబసభ్యులకు ఇస్తామనే చెప్పారు. ఇవి కాలం చెల్లినవి కావచ్చు లేదా ఎండకు ఎక్స్ పోజ్ అయినవీ మిగతా ఎన్నో కారణాలలు అనారోగ్యం తెచ్చిపెడతాయని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందనొ వైద్యులు చెపుతున్నారు.

Leave a comment