స్వేదం చిరాకు కలిగిస్తుంది. బ్యాక్తీరియాలో కలిసి దుర్వాసన కు కారణం అవుతుంది. ఈ ఇబ్బంది గురించి అదే పనిగా యాంటీ పరిస్పిరెంట్స్  వాడుతూవుంటారు. వీటి వాడకం అంత క్షేమేం కాదంటారు వైద్యులు. ముందుగా లేబుల్ చెక్ చేసుకోవాలి. చాలా ఉత్పత్తులు  యాంటీ పరిస్పిరెంట్ డియోడరెంట్  కలగలిసి ఉంటాయి. యాంటీ పరిస్పిరెంట్ వల్ల  చెమట బయటకు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో టాక్సిన్స్ విడుదలవుతాయి . మోకాళ్ళ వెనుక చెవుల వెనుక ముంజేతుల కింద ఈ ప్రదేశాలుంటాయి. ఈ టాక్సిన్స్ పరిస్పిరెంట్  తో మాయం కావు.శరీరం వాటిని లింప్ ల రూపంలో నిల్వ చేస్తుంది. ఇదీ నష్టమే. డియోడ్రెంట్స్ కొంత మంచివే అయినా కొన్ని కమర్షియల్ రకాల్లో శరీరానికి టాక్సిక్ పదార్ధాలు వుండే అవకాశాలున్నాయి. ఇవి చేతుల కింద చర్మ రంధ్రాలని బ్లాక్ చేస్తాయి. అప్పుడు అసలైన సమస్య వస్తుంది. యాంటీ  పరిస్పిరెంట్స్  బదులుగా సహజ డియోడ్రెంట్స్ వాడటం కొంతవరకు క్షేమం.

Leave a comment