అపార్టుమెంట్స్ లో మొక్కలు పెంచటం చాలా కష్టం .ఏ వాకిట్లో నూ రెండు కుండలు పెట్టుకోవాలన్న అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అంతమాత్రనా ఇంట్లో పచ్చగా నాలుగు ఆకులు ,రెమ్మలతో రెండు పూవులతో తోటపెంచితే బావుంటుంది. అనిపించకుండా ఉంటుందా? మెగ్నెట్ ఫ్లాంట్ అని ఆన్ లైన్ లో వెతికితే ఒక చిన్నా అయిస్కాంతం అంటించే బుల్లి కుండీలు ,రకరకాల ఫ్లవర్ వాజుల్లాంటివి కనిపిస్తాయి. అయిస్కాంతాలు ఈ కుండీలను పట్టి ఉంచుతాయి. తేలికైన ఈ గాజు,చెక్క మట్టి కుండీల్లో అందమైన సీజనల్ గా పూసే మొక్కల్నీ పెంచుకోవచ్చు .వరుసగా గోడకు అంటించేవి ,కిచెన్ లో పెట్టి ఏ తోటకూరనో పెంచేవి చాలానే ఉన్నాయి. ఈ అయిస్కాంతపు కుండీలు ఇంటికే అందం తెస్తాయంటే అశ్చర్యం లేదు.

Leave a comment