నీహారికా,  ఒక ముఖ్యమైన రిపోర్టు వచ్చింది. ఉద్యోగం చేసే తల్లులు పిల్లలకు మధ్య ఎక్కువ అనుబంధం ఉంటుందని వారు మంచి సన్నిహితంగా మెలుగుతారని ఒక అధ్యాయనం చెపుతుంది, ఉద్యోగం చేస్తున్న తల్లులు పిల్లలతో మరి కఠినంగా ప్రవర్తించకపోవటం వాళ్ళకు కావలిసిన స్వేచ్చ ఇవ్వడం కారణంగా చెపుతున్నారు. బయట ఎక్కువ సమయం గడిపే తల్లులు పిల్లలకు తాము చూసిన తెలుసుకున్న ఆనందకరమైన జీవితాన్ని పంచి ఇస్తారని పిల్లల కోపాతాపల్ని ఎదుర్కోనే శక్తి వారిలో ఎక్కువని చెపుతున్నారు. పిల్లలతో గడిపే కొద్ది సమయం ఆనందంగా ఉండేందుకు పిల్లలను సంతోషంగా ఆడించేందుకు చూస్తారని ఈ ఆలోచన పిల్లల్ని తల్లులని కట్టి పడేస్తుందని చెపుతున్నారు. ఉద్యోగినులు పిల్లలను పట్టించుకోరనే విషయం పూర్తిగా నిజం కాదాని వాళ్ల పిల్లల వల్ల వారంతా బాధ్యతగా ఉంటారని పరిశోధనలు చెపుతున్నాయి.

Leave a comment