భార్యభర్తలు అన్యోన్యంగా కలసి ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు పరిశోధకులు. 42 నుంచి 77 ఏళ్ళ మధ్య వయస్సు గల 20 లక్షల మందిపై దీర్ఘకాలం అధ్యయనం చేసి విడాకులు తీసుకొన్న వారి లోనూ ,భాగాస్వామిని కోల్పోయినా వారిలోనూ గుండె జబ్బులు వచ్చే అవకాశం 42 శాతం ఉందని వీరు గుర్తించారు. అదే అవివాహితుల్లో ఈ ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉందని వారికి 43 శాతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. భార్య భర్తలో ఎవరికైనా వ్యాధి వస్తే రెండో వాళ్ళ సపర్యలతో వాళ్ళు త్వరగా కొలుకొనే అవకాశం ఉందనీ ,ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment