ఈ మధ్యకాలంలో రాక్ సాల్ట్ ఎక్కువ వాడుతున్నారు. ఈ రాతి ఉప్పు వాడకం ఎప్పటినుంచో ఉంది.రాతి ఉప్పు గనుల నుంచి తీస్తారు ఏ ఉప్పు లో అయినా ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్. చాలా తక్కువ మోతాదులో పొటాషియం కాల్షియం ఉంటాయి రోజు వాడినా ఇబ్బంది ఏమీ ఉండదు ఇందులో అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు అన్ని వేరుగా లభిస్తాయి. సైంధవ లవణం పింక్ సాల్ట్ లో మిగతా రకాల ఉప్పు తో పోలిస్తే ఖనిజాల శాతం ఎక్కువ.సోడియం శాతం తక్కువ పింక్ సాల్ట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెపుతారు.కానీ సరైన  శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు.

Leave a comment