కర్ణాటక కు చెందిన ఆశా వర్కర్ 50 ఏళ్ల రాజీవి నాయక్, తెల్లవారుజామున ఒక నిండు గర్భిణిని తన ఆటోలో ఎక్కించుకుని 20 కిలోమీటర్ల లోని ఆసుపత్రికి తీసుకు పోయి ఆమె ప్రాణాలు నిలిపిన కబురు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఉడిపి జిల్లా లోని ఫెర్నాన్ ఖిలా గ్రామానికి చెందిన రాజీవి ఆశ కార్యకర్త గా పనిచేస్తోంది.అవసరంలో గర్భిణీల ను ఆస్పత్రికి తరలించేందుకు ఆశ కార్యకర్తగానే కాక మనసున్న మనిషి లా సిద్ధంగా ఉంటుంది. శ్రీలత అన్న గర్భిణిని అంబులెన్స్ కు ఫోన్ చేసే అవకాశం కూడా లేని సందర్భంలో,నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఆటోలోనే ఆస్పత్రికి తరలించింది.ఫెర్నాన్ ఖిలా నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి జిల్లాలోని ఆస్పత్రికి సురక్షితంగా తనకు తీసుకువెళ్ళింది రాజీవి నాయక్.

Leave a comment