ఆపిల్ పియర్ ఇవి ఆపిల్ మాదిరిగా కొరికి తినే పండ్ల ఆపిల్స్ లా గుండ్రంగా పసుపు పచ్చగా వుంటాయి. దక్షిణ ఆసియా దేశమంతా విరివిరిగా కాస్తాయి. ఈ పండ్లతో జామ్ లు జెల్లీలతో పాటు సలాడ్స్ లోను వాడతారు. ఇతర పియర్ జాతి పండ్ల తో పోలిస్తే  పిచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. గుండె ఆరోగ్యానికి ఎముకలు బలంగా వుండేందుకు అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. నీటి శాతం చాలా ఎక్కువ శరీరంలోని కణాలు, కణజాల పనితీరుకు దోహద పడే సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైత్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. ఇందులో వుండే పొటాషియం,సోడియం ఎక్కువ గా వుండే ఆహార పదార్ధాలు తిన్నప్పటికీ పెద్ద సమస్యలు లేకుండా విరుగుడుగా పని చేస్తుంది. కంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. మొత్తం ABCDEK విటమిన్ల తో పాటు ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటి ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు దొరుకుతాయి. అందుకే ఈ పండ్లను అనేక వ్యాధుల నివారణ కోసం వాడతారు. చెర్మానికి నిగారింపు తో పాటు కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా వీటిని తింటుంటారు.

Leave a comment