యాపిల్, ఖర్జూరం వంటి పండ్ల  విత్తనాల్లో  ఎమిగ్ డాలిన్  అనే సమ్మేళన పదార్థం ఉంటుందని ఇది మానవ జీర్ణ ప్రక్రియ ఎంజైమ్ల తో కలిస్తే సైనెడ్ విడుదల అవుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ విత్తనం పై గట్టి పూత ఉంటుంది. అంచేత విత్తనం లోపలి పదార్థం జీర్ణప్రక్రియ ఎంజైమ్ తో కలవదు. పొరపాటున ఒక గింజ ఎవరైనా మింగిన ప్రమాదం లేదు. అది మానవ శరీరంలో ఎటువంటి మార్పు చెందకుండా విసర్జితం అయిపోతుంది. కానీ ఎక్కువ పరిమాణంలో ఈ యాపిల్ విత్తనాలు తింటే అనారోగ్యానికి గురవుతారని చెపుతున్నారు డాక్టర్లు . అందమైన గులాబీ  పువ్వు పక్కనే ముళ్ళున్నట్లు, అత్యంత ఆరోగ్యాన్నిచ్చే యాపిల్ గింజలో సైనెడ్ ఉండటం ప్రకృతి రహస్యం అంటారు పరిశోధకులు.

Leave a comment