అది మంచి విషయమైతే తప్పకుండ వైరల్ అవుతుంది ప్రపంచం హర్షం చేస్తుంది . నిషి దోషి అన్నా అమ్మాయి పోలీసులకు ఓ ట్వీట్ చేసింది .ధారోని పోలీస్ స్టేషన్ నెంబర్ ఇవ్వగలరా అర్జెంట్ అని . వెంటనే పోలీస్ స్పందించారు . అంతలో చిక్లూ అన్నవాడు మధ్యలో దూరిపోయాడు . ఈ నిషీ దోషి  నంబర్ నాకు ఇవ్వగలరా అని పోలీసులకు  ట్వీట్ చేశాడు . వెంటనే పోలీస్ లు ,తప్పకుండ ఆమె నంబర్ తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉన్నట్లే మీ నంబర్ కోసం మాకూ ఆసక్తి గానే ఉంది అన్నారు . ఈ ట్వీట్ కు మహిళలు ముచ్చట పడిపోయారు . క్షణాల్లో పోలీసులకు ఎన్నో లైక్స్ వచ్చాయి . నివేదిత అన్న అమ్మాయి ఎంతో ప్రేమగా ఐ యామ్ యువర్ జబ్రి ఫ్యాన్ పూణే పోలీస్ అంటూ ట్వీట్ చేసేంది పోలీసులకు వస్తున్న అభినందనలకు లెక్కలేదు

Leave a comment