Categories
స్పారో వ్యవస్థాపకురాలు, ప్రముఖ తమిళ రచయిత్రి కథా సంకలనం శిరప్పు కళ త్తుడవ్ బారు పచ్చాయ్ (ఎర్రని మెడ ఉన్న పచ్చని పక్షి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయింది 19 సంవత్సరాల వయసులో కథలు వ్రాయటం మొదలు పెట్టిన అంబై మహిళలు ఎదుర్కొంటున్న పరోక్ష ప్రత్యక్ష సమస్యల పై ఎన్నో గొప్ప కథలు రాశారు. సమాజం లోనే అపసవ్య ధోరణులను ప్రశ్నించే ఆమె కథలు సాంప్రదాయ పాఠక వర్గాలకు ఆశ్చర్యం కలిగించాయి. మనం ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు ఏమిటి అనుకొన్నారు కోయంబత్తూర్ లో జన్మించిన అంబై అసలు పేరు సి ఎస్ లక్ష్మి తమిళనాడు లో స్కూల్ టీచర్ గా లెక్చరర్ గా పని చేశారు.