18 నుంచి 25 సంవత్సరాల వయసు గల మహిళల్లో ఫోన్ లో మాట్లాడే ఇష్టం రోజురోజుకూ పెరుగుతుందని కనీసం పర్సనల్ టైమ్ ను కూడా వాళ్ళు ఫోన్ లేకుండా మెయింటెయిన్ చేయలేకపోతున్నారని మెరింత పేరెంట్స్ నెట్వర్క్ మామ్స్ అండ్ మీడియా సర్వే రిపోర్ట్ చెపుతుంది. భర్తతో సన్నిహిత సమయాల్లో కూడా వాళ్ళు టెలిఫోన్ వదలరని ఆ రిపోర్ట్. టెక్స్ట్ మెసేజ్ లకు సమాధానం ఇవ్వడం, ఫేస్ బుక్ అప్ డేట్స్ చూసుకోవడం కూడా నిమిషానికి ఫోన్ వంక చూస్తారని సర్వే చెపుతుంది. ఇక సేల్ఫీ విషయమైతే అంతులేని శ్రద్ధ. ప్రతి నిమిషం వాళ్ళేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు సోషల్ మీడియా లో పంచుకోవడం కోసం తహ తహ లాడతారని చివరకు ఆకుకూర కొంటున్నా సరే ఆ కూర ఎంత ఫ్రెష్ గా వుందో చెపుతూ ఫ్రెండ్స్ కు మెసేజ్ లేదా సేల్ఫీ పంపుతున్నారని రిపోర్ట్ సారాంశం. ఇందులో అతిశయోక్తులు ఉండచ్చు కానీ వ్యక్తిగత సమయాన్ని ఫోన్ కు ఇస్తున్నాము అన్నది అందరూ ఆలోచించుకోవలసిన విషయం.

 

Leave a comment