Categories
Nemalika

అప్పులతో ఎప్పుడైనా తిప్పలే

నీహారికా,

ఇప్పుడొక సర్వే గురించి చెప్పాలనుకున్నాను, శ్రద్ధగా వినాలి నువ్వు. అందరి దగ్గరా ఇప్పుడు క్రెడిట్ కార్డులుంటున్నాయి. ఎన్ని కార్డులు వుంటే అంత గొప్ప మామూలుగా. సాధారణంగా ఏ వస్తువు అప్పటికప్పుడు కంటికి ఇంపుగా కనిపించినా వెంటనే కొనేయడానికి పర్సులు వెతుక్కోనక్కరలేదు. చేతిలో క్రెడిట్ కార్డు వుంటుంది. వెంటనే కొనేస్తారు. కానీ ఆ అప్పు మన బ్యాగ్ లోంచి రాదుగా. అది క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు 30, 40 శాతం ఎక్కువగా చెల్లిస్తున్నారనుకోవాలి. తాత్కాలికంగా ఈ అవకాశం మనల్ని సంతోష పెడుతుంది. కానీ అప్పు ఎంత ప్రమాదకరమో వడ్డీలు, అదీ చక్ర వడ్డీ తో సహా తీరుస్తూ పోతూ వుంటే అప్పుడు అర్ధం అవుతుంది. అందుకే క్రెడిట్ కార్డు మాయాజాలంలో చిక్కుకోవద్దు అని చెప్పడం కోసమే ఈ విషయం ప్రస్తావించాను. క్రెడిట్ కార్డు వాయిదా కనుక సకాలంలో చెల్లించక పోతే ఆ తప్పు వసూలుకు వచ్చిన వాళ్ళు చేతుల్లో పరాభవం తప్పదు. జీవితంలో స్థిమితంగా బతకాలంటే అప్పు చేయకూడదు.

Leave a comment