వరి కంకుల నుంచే బియ్యం వస్తాయి కదా. కానీ వెదురు చెట్టుకు కూడా బియ్యం పండుతాయి. ఈ బియ్యాన్ని పండించటం అంత తేలిక కాదు. వెదురు సాధారణంగా పూయదు 50 ఏళ్ళకోసారి కొన్ని వెదురు జాతులు పూస్తాయి. బియ్యం కంకులు వస్తే వెదురు చనిపోతుంది. ఎక్కడో ఒకచోట పండే ఈ వెదురు బియ్యాన్ని గిరిజనులు సేకరించి. వీటిని లేత వెదురు ఆకుల రసాన్ని పట్టించి పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఎన్నో పోషక విలువలతో వుంటాయి ఇవి ఎన్నో ఔషధ గుణాలుంటాయి విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు,పిచ్చు ఎక్కువ,పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కీళ్ళు వెన్నునొప్పి సమస్యలు తగ్గుతాయి.

Leave a comment