Categories
WoW

అరచేతిలో అచ్చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ లో పోర్ట్రయిట్ మెహందీ అని కొట్టి చుస్తే వచ్చిన ఇమేజస్ ఆశ్చర్యం కలిగిస్తాయి. పెళ్ళి సమయంలో పెట్టుకునే గోరింటాకులో దంపతుల బొమ్మలు వచ్చేలా చేసేదే ఈ పోర్ట్రయిట్ మెహందీ. బొమ్మ చుట్టూ వేరే డిజైన్ వస్తుంది కానీ అరచేతుల్లో మాత్రం వధూవరుల చిత్రాలోస్తాయి. కాబోయే దంపతుల ఫోటోలు పంపేస్తే వాటి స్కెచ్ గీసి, అదే ఆకృతి వచ్చేలా స్టెన్సిల్ తరహాలో స్టిక్కర్స్ రూపొందిస్తారు. మెహందీ పెట్టేటప్పుడు ఆ స్టిక్కర్ అరచేతిలో వుంచి దాని పైన గొరింటాకు పెట్టేస్తే, ఆ స్టిక్కర్ అరచేతిలో వుంచి దాని పైన గోరింటాకు పెట్టేస్తే, ఆ స్టిక్కర్ అతికించిన భాగం కుండా మిగితా భాగం పండుతుంది. అంటే మను కావాల్సిన బొమ్మ అరచేతిలో పండుతుందన్నమాట. పెళ్ళే కాదు పుట్టిన రోజుకీ స్పెషల్ అకేషన్ కి మన ఫోటో మన అరచాతిలో పండించుకోవచ్చు అన్నమాట.

Leave a comment