చిన్న ముత్యం ,లేదా వజ్రం ,విలువైన రాయితో వేలికి బంగారు ఉంగరం పెట్టుకోవటం ఒకప్పటి ఫ్యాషన్. ఇప్పుడు వేలు మొత్తం కప్పేసేలా పోలిన జ్యువెలరీ వచ్చింది. అన్ కట్ డైమండ్స్ ను బంగారు ఫాయిల్ పేపర్ తో పొదిగిన అందమైన ఉంగరాలు ఇవి.మేలుజాతి రాళ్ళు బంగారు ఫాయిల్ తో మీనాకారి పద్దతిలో కుందన్ జ్యువెలరీలో కూడా ఈ ఉంగరాలు చాలా బావుంటాయి. ఇవి అరచేతి వెడల్సును ఉండే పెద్ద ఉంగరాలు. చేతి గాజును, వేలి ఉంగరంతో చైన్ తో కలిపినట్లు ఉండే హాథ్ ఫూల్ చాలా బావుంటుంది. వెడల్పాటి బ్రాస్ లెట్ దాన్నుంచి నాలుగు గొలుసులు ,నాలు వేళ్ళ ఉంగరాలు కలిపినట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడీ పెద్ద సైజు ఉంగరాలే ఫ్యాషన్.

Leave a comment