ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా  దర్శకులు కేవలం స్టూడియోలకే  పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్  పూజా మందిరాలు డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎదో ఒక సినిమా లో అచ్ఛం మీనాక్షీ దేవి ఆలయం కట్టినట్లు నెట్లో చార్మినార్ నిర్మించినట్లు అన్నమయ్య సినిమా కోసం వెంకటేశ్వర స్వామి గుడి డిజైన్ చేసినట్లు పూజా మందిరాల డిజైన్స్ వసున్నాయి. పూజారుల  సిద్ధాంతుల సలహాలతో గది  ప్రవేశ ద్వారం నుంచి లోపల అమర్చే దేవుడి పీఠం వరకు అంతా పర్  ఫెక్ట్ డిజైన్. గ్రానైట్ పాలరాళ్లు రత్నాలు చెక్కిన నగిషీలు గూళ్ళలాగా గంటలు హారతికి దీపాలు అసలెప్పుడు హారతి ఇస్తున్నట్లే వెలుగులు వాస్తు శాస్త్ర  ప్రకారం ఒక తలుపో  రెండు తలుపులో అమర్చేసి  ఇంటిలో దేవుడికో ప్రత్యేకమైన గుడి ఇచ్చేస్తున్నారు. ఇంట్లో ప్రతిష్టించే ఈ కోవెలలో ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. కొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఓ ఐడియా వస్తుంది. దేవుడికీ ఓ ఇల్లొస్తుంది.

Leave a comment