ఆదిమ జాతుల సంస్కృతి పరిరక్షణ విషయంలో కృషి చేస్తోంది అర్చన సోరింగ్ ఒడిశా లోని సుందర్ ఘర్ కు చెందిన అర్చన సోరింగ్ కు సంప్రదాయ జ్ఞానం పై అవగాహన ఉంది.ఆమె రచనలు జాతీయ అంతర్జాతీయ వెబ్ సైట్ లలో చోటుచేసుకున్నాయి. తమకు ఉండే అవగాహనతో మన పూర్వీకులు అడవులను సంరక్షించారు ముందు తరాల వారి అమూల్యమైన కానుకను అందించారు.ఇప్పుడీ బాధ్యత మనపై ఉంటుంది అంటోంది అర్చన సోరింగ్.ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూప్ లో ఒకరు గా ఉంది అర్చన. వాతావరణం సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గానూ తీసుకోవలసిన చర్యల పై అర్చన పని చేయబోతోంది.

Leave a comment