ఐఎంఎఫ్ కు చీఫ్ ఎకనమిస్ట్ గా నియమితులయ్యారు గీతా గోపీనాథ్. మనీ మేనెజ్ మెంట్ ని గుప్పిట పట్టిన గీతా గోపీనాథ్ డిసెంబర్ 1971న కోల్ కతా లో జన్మించింది. తండ్రి గోపీనాథ్ రైతు ,తల్లి విజయలక్ష్మి గృహిణి. గీత గ్రాడ్యుయేషన్ వరకు భారతదేశంలోనే చదువుకున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 1994లో వాషింగ్టన్‌కు వెళ్లారు. 1996 నుంచి 2001 వరకు ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత 2001 నుంచి 2005 వరకు చికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పని చేశారు. 2005లో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2010లో ఆమె అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2015 నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో ఐఎంఎఫ్ ప్రకటించిన 25 మంది అత్యున్నత ఆర్థికవేత్తల్లో ఒకరిగా స్థానం సంపాదించింది. 2011లో యంగ్ గ్లోబెల్ లీడర్ గా ఎంపికైంది. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ఆర్థిక వేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరు.

Leave a comment