బొద్దింకల బెడద వదిలించుకునేందుకు గాఢమైన రసాయనాలు ఉన్న మందులు వాడితే అనారోగ్యాలు వస్తాయి. కొన్ని చిన్న చిట్కాలతో బొద్దింకల బాధ వదిలించుకోవచ్చు బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో బేకింగ్ సోడా చల్లితే బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే నిమ్మకాయను చిన్న ముక్కలుగా తరిగి సింగ్ లో వేస్తే అక్కడి కి బొద్దింకలు రావు, వాడేసిన నిమ్మకాయ తొక్కలను సింక్ లోనే ఉంచాలి. బీరువాల్లో బట్టల మధ్య కర్పూరం లేదా  నాఫ్తలీన్ బిళ్ళలు పెడితే బొద్దింకల వాటిలో చేరకుండా ఉంటాయి. బోరాక్స్ పౌడర్ లో కొంచెం పంచదార కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే శాశ్వతంగా రాకుండా చేయవచ్చు.

Leave a comment