రెండోదశలో కరోనా త్వర త్వరగా మారిపోతే వేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా ఉంది. అయినా వ్యాక్సినేషన్ వేయించుకుంటే వైరస్ ను కొంతయినా ఎదుర్కోగలమని  పరిశోధకులు చెపుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత అలర్జీ, నొప్పులు కొందరికి వచ్చే అవకాశం లేకపోలేదు.  వ్యాక్సిన్ కు ముందు తర్వాత కూడా ఆహారంలో మార్పులు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తక్కువ అంటున్నారు .యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఎక్కువగా ఉండే పాలకూర కేల్ బ్రోకోలి వంటివి ఎక్కువగా తీసుకోవాలని రోగనిరోధక శక్తిని పెంచే అన్నిరకాల రంగుల కూరలు పండ్లు తినాలనీ, ఉల్లి, వెల్లుల్లి తో పాటు పెరుగు, ఇడ్లీ, డోక్లా వంటి ప్రోబయోటిక్స్ ఆహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment