ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్స్ నివారించ వచ్చు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కనుక హానికరమైన కొలెస్ట్రాల్ ను తగ్గించ గలవు. లాక్సిటివ్ ఎక్కువగా వుండే ద్రాక్ష పండ్లు మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అజీర్ణం, ఉదరం ఇరిటేషన్ నుంచి రక్షిస్తాయి. పర్పుల్ గ్రేప్ జ్యూస్ బ్రెస్ట్ కాన్సర్ ను అరికట్టే గుణం వుందని పరిశోధనలు చెపుతున్నాయి. యాంటి ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు, ఖనిజాలు ఇంకెన్నో విటమిన్లు గల ద్రాక్ష రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయగలదు.

Leave a comment