నెయ్యి తో కొవ్వు పెరిగి పోతుంది అనే భావన నుంచి బయటకు రావాలి అంటున్నాయి అధ్యయనాలు. ఇందులో యాంటీ వైరల్ గా పనిచేసే బుటిరిక్ యాసిడ్స్ ఉన్నాయి. బీటా-కెరోటిన్ లకు ఎ,డి,కె విటమిన్ లకు నెయ్యి నిధి వంటిది మిగతా వంటనూనెలల్లో కంటే నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. నెయ్యి లోని జీవశక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచే అంశాలు ఆయుష్ పెంచడంతో పాటు వార్ధక్య లక్షణాలు నివారించి యవ్వనాన్ని నిలబెడతాయి. నెయ్యి పిల్లల ఎదుగుదలకు తోడ్పడటం తో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుతుంది.

Leave a comment