ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది. బార్లీ అద్భుతమైన అపురూప శక్తిగత గింజ ధాన్యం. రుచి పరిమళం కూడా వుంటుంది. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నల్గోవ పంట. శరీరానికి ద్రుడంగా దేహక్రుతి చెక్కగా తీర్చిదిద్దుకోవడానికీ ఈ చిన్ని గింజలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజల్లో పీచు, సెలీనియం పుష్కలంగా వున్నాయి. ఖనిజ లవణాలు ఫాస్పరస్, కాంపర్ మంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. బార్లీ శరీరంలో చెడు కొలెసస్ట్రోల్ తగ్గిస్తుంది. మోనోపాజ్ దాటిన మహిళలు ఇవి తీసుకుంటే రక్త నాళాలు పుడుకు పోవడం రక్త ప్రసరణ జరిగే నాళాలు కుచించు పోయేలా చేసే ఫ్లాక్ ఏర్పడటం గణనీయంగా తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం రానీయదు. పిండి పదార్ధాలు మాంసాకృతులు, విటమిన్లు, ఖనిజాలు, పోషక ఔషధ గుణాలున్న బార్లీ  గింజలు ఆరోగ్య సిరులు.

Leave a comment