చల్లగా ఉండే ఈ సీజన్ లో జలుబు దగ్గు వస్తూనే ఉంటాయి. అస్తమానం మందులెందుకు కమ్మని టీ తాగండి ,ఇందులోని యాంటీ వైరల్ గుణాలు జలుబు,దగ్గు రాకుండా చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అల్లం ,మిరియాలు, తులసి ఆకులు,లవంగాలు ,దాల్చిన చెక్క కలిపి దంచి నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయంలో తేనె కలిపి తాగితే ఏ జలుబులు రావంటున్నారు .లేదా ఇందులో టీ పొడి ,పాలు కలిపి అద్భుతమైన టీ చేసుకోండి ,చల్లని రోజుల్లో ఆరోగ్యం ,ఆహ్లాదం కూడా అంటున్నారు. ఇంకా కావాలి అనుకొంటే వేడి నీళ్ళలో తేనె నిమ్మరసం కలిపి తాగవచ్చు. వేడి వేడి పాలల్లో తేనె ,దాల్చిని పౌడర్ కలిపి తాగవచ్చు. బెల్లం ,మిరియాల పొడి వేసిన పాలు ఇంకా బెస్ట్ అంటున్నారు. కాఫీతో పాటు ఇలాంటి పానీయాలు చల్లని రోజుల్లో ఆరోగ్యం అంటున్నారు.

Leave a comment