వాకింగ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అయితే ఈ వాకింగ్ ఎక్కడ చేస్తున్నారో చెక్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చగా ఉండే పార్కులు వాకింగ్ ట్రాక్ లో ఎంపిక చేసుకొని నడవాలి. ఆ పరిసరాల్లో ఉండే చెట్లతో తాజా గాలి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాని రోడ్డు మార్జిన్ లతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ అస్సలు చేయకూడదు.ఇలాంటి చోట్లలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దుమ్ము ధూళి,శబ్దాలు, వీటన్నింటితో ఆరోగ్యం మాట అలా ఉంచి లేని పోని అనారోగ్యలు వస్తాయి జాగ్రత్తా అంటున్నారు.

Leave a comment