మన శరీరంలో ప్రతి అవయవం ,నిర్మాణం,పని చేసే తీరు గమనిస్తే సృష్టికర్త ఎంత అద్భుతమైన వాడో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పరిశోధకుడు కంట కన్నీరు ఒలికిస్తే మంచిది అంటున్నారు. జపాన్ కు చెందిన యోషిడ్ కనీసం వారానికి ఒక్క సారి ఏడవంండి అంటున్నారు.ఏడవటం వల్ల శరీరంలో ఎండో మార్ధిన్స్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. విషాద సంగీతం విని కానీ ,ట్రజాడీ మూవీస్ చూస్తుగానీ కాస్త కన్నీరు కార్చితే మంచిదట. ఇప్పడు జపాన్ లో ఉన్న ఎన్నో సంస్థలు యోషిడా ని ఏడుపు వల్ల ఉపయోగాలు చెప్పమని ,క్లాసులు తీసుకోమని ఆహ్వనిస్తున్నాయట. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఏడవటం అంటే బలహీనత అన్న విషయం మరచిపోతే మంచిదేమో. ఆరోగ్యాన్ని ప్రశాంతతను ఇచ్చే కన్నీటిని ఆహ్వానించాలి కదా!

Leave a comment