ఒంటరిగా వుంటే గ్రెల్లిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందట. అందువల్లే ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతోంది అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. అలాగే ఒత్తిడిగా ఉన్న దాన్ని దూరం చేసుకొనేందుకు ఏదో ఒకటి తినడం మొదలుపెడుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ముందు మనస్సును తిండి వైపుగా పోనివ్వకుండా జాగ్రత్త పడమంటున్నారు. అలాగే ఆహారంలో కూడా ఆరోగ్యవంతమైనా మార్పును తెచ్చుకోవాలి. చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టాలి. విభిన్న రకాల కూరగాయాలతో నిండిన సలాడ్ తో రోజులో ఒకసారి తినడం మొదలు పెట్టాలి. వెన్న బదులు ఆలివ్ ఆయిల్ తో వండినవే తినాలి. ఇలా ఒక్కొక్కటి మంచి ఆరోగ్య వంతమైన ఛాయిస్ లలో జత చెర్చుకొంటుపోవాలి.

Leave a comment