చర్మ సౌందర్యానికి పరిమళ నూనెలు ఎంతగానో ఉపయోగ పడతాయి అయితే చర్మం తీరును బట్టి ఎంచుకోవాలి. ఉదాహరణకు పొడిచర్మం అయితే బాదం నూనె,రోజ్ హిప్ నూనె మేలుచేస్తాయి. బాదం నూనె చర్మంలో తేమనే కాదు మృదుత్వాన్ని పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్-ఎ రెటినాల్ చర్మం కింది రక్తనాళాలను ప్రేరేపిస్తాయి. చర్మం బిగుతుగా ఉండేందుకు తోడ్పడే కొలాజెన్ ఉత్పత్తిని దోహదం చేస్తాయి. అలాగే రోజ్ హిప్ నూనెలో అత్యవసర కొవ్వు ఆమ్లాలన్నీ ఉంటాయి. అందువల్ల పొడిచర్మానికి మేలు కలుగుతుంది. దాన్ని చర్మం తేలికగా ఉహించుకొంటుంది. ఇది చర్మం పైన తేమను పట్టి ఉంచుతుంది.

Leave a comment