వేడుకలు, వ్రతాలు పండగల్లో పట్టుచీరెలే అందం అందులోనూ కంచిపట్టు మరీ ప్రత్యేకం. పెద్దంచు జరీ చీరెలు కట్టుకో గానే సాంప్రదాయ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే ఆ పట్టు చీరె ఎంపికలు పది పన్నెండు అంచుగల చిరాయితే అందంగా ఉంటాయి. ఎరుపు, రాయల్ బ్లూ, పచ్చ, మెజెంటా కలర్స్ కాంతివంతంగా పండగ కళను తీసుకొస్తాయి. మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ లేదా పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఎంపిక చేసుకుంటే పట్టు చీరెలు పర్ఫెక్ట్ అనిపిస్తాయి. ఘనంగా ఉన్న ఈ చీరె బ్లౌజ్ కు తోడుగా టెంపుల్ జ్యువెలరీ సరైన ఎంపిక.

Leave a comment