ఆయుష్మాన్‌ ఖురానా  పోలీస్‌ ఆఫీసర్ గా నటించిన హిందీ చిత్రం ఆర్టికల్‌ 15 చూడ దగిన ఒక పవర్ ఫుల్ నినిమా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ఈ సినిమా కి ఆధారం. ఈ సినిమా గురించి ఎంత రాసిన తక్కువే. కులాల మధ్యనే ఉండే దారుణమైన తేడాలు మూడు రూపాయల కూలీ అడిగినందుకు ముగ్గురు గ్రామీణ బాలికలను రేప్ చేస్తారు. ఇద్దరిన్ని ఉరి తీస్తారు. మూడో అమ్మాయి దొరకదు. కొత్త ఆఫీసర్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ క్షణం లో గ్రామాల్లో ఉండే కులాల ఆధిక్యతలు,రాజకీయ నాయకుల టక్కరి తనాలు,పోలీస్ ల లంచగొండి తనం ప్రజల్లో భయం మొత్తాన్ని ఈ సినిమా లో చూడచ్చు ఇలాటి మంచి సినిమా ని లాక్ డౌన్ తీరికలో తప్పకుండ చూడాలి. నెట్ ఫ్లిక్స్ లో వుంది సినిమా.

Leave a comment