భారత స్వాతంత్రోద్యమ యోధురాలిగా తెలంగాణ సాయుధ పోరాట వీర రాలుగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నాయకురాలు కూడా. 1920లో తెలంగాణలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మంతపురి లో జన్మించారు కమలాదేవి. 12వ యేట ఆరుట్ల రామచంద్రారెడ్డి తో పెళ్లయింది. 1932లో కమలాదేవి చదువు కోసం హైదరాబాద్ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాంగ్రెస్ నుంచి వామపక్ష మార్గానికి మళ్ళిన కమలాదేవి విజయవాడ లో వామపక్ష విద్యలు నేర్చుకున్నారు. సాయుధ గెరిల్లా ఉద్యమంలో పని చేసి అరెస్టయ్యారు. 1952 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. పన్నెండేళ్ళపాటు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శాసన సభ్యురాలు గా ఉన్నారు.

Leave a comment