కైరవి మెహతా ను స్టీల్ రంగానికి రాణి అంటుంటారు తండ్రి వి.కె ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధిపతి.దేశవ్యాప్తంగా వీరికి వేర్ హౌస్ లు ఉన్నాయి. ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవడం కోసం కైరవి మెహతా ఎంతో కష్టపడింది. మేనేజ్మెంట్ డిగ్రీ చేసింది నేరుగా సి ఈ ఓ బాధ్యతలు తీసుకోకుండా కింద స్థాయి నుంచి వర్కర్స్ తో కలిసి పనిచేసింది. డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వేగవంతం చేసేందుకు సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టింది ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కస్టమర్స్ ను పెంచి సంస్థను 500 కోట్ల వ్యాపారం లాగా మార్చేసింది.

Leave a comment