నీహారికా,

చాలా మంది ఏ పనీ ప్రారంభించకుండానే బోలెడన్ని సందేహల్లో మునిగి పోతారు. ఉదాహరణకు ఒక చెట్టు నాటితే ఎప్పటికైనా ఆ చెట్టు పండో, పుష్పమో, ఎదో ఇస్తుంది. అసలు చెట్టే నాటకుండా అది నాటితే బతుకుతుందా? బతికినా బాగా పెరుగుతుందా? పూత పూస్తుందా? పూత రాలిపోకుండా ఉంటుందా? ఇలాంటి సందేహాలతో అస్సలు చెట్టే నాటే పని పెట్టుకోరు. కానీ చెట్టే నాటకుండా, అంటే అసలు పనే ప్రారంభించకుండా ఏదీ ఫలితం ఇవ్వడు. ఏదైనా రాయాలనుకుంటే ముందు అక్షరాలూ రాయాలు. అవి పదాలవ్వుతాయి. పదాలు వాక్యాలవ్వుతాయి. అలాంటి వాక్యాలెన్నో కలిసి ఒక గ్రంధం అవ్వుతుంది. అందుకే అసలంటూ మనిషి ఏదైనా పని పెట్టుకోవాలి ఆ పని శక్తి వంచన లేకుండా శ్రద్దగా చేయాలి. ఫలితం తప్పకుండా వస్తుంది. సందేహం తో ప్రారంభించక పొతే, సమయం వృధా అయిపోయినట్లే కదా. అందుకే ఎవరేనా ఎదో ఒకటి బతుకు తెరువు కోసమే అయినా సరే పని మొదలెట్టి శ్రద్ధగా చూస్తూ పొతే ఫిలితం సక్సెస్  ఫుల్ గానే వస్తుంది. వేమన శతకం లో చెప్పినట్లు చెట్టు నాటితేనే పండు తధ్యం, భగవద్శక్తి వుంటే ముక్తి తధ్యం.

Leave a comment