కేవలం స్త్రీల కోసం గా ఒక పరిశోధన రిపోర్ట్ వచ్చింది .సరైన పద్ధతులు పాటించకుండా,ఆరోగ్య పరిరక్షణ మీద సరైన అవగాహన లేకుండా చేసే చిన్న చిన్న తప్పులకు పెద్దమూల్యం చెల్లించుకోవలసి వస్తుంది . శరీరం గురించి శ్రద్దగా పట్టించుకోకపోతే నష్టమే అంటున్నారు పరిశోధకులు . కొన్ని రకాల రుగ్మతలకు ముందే సంకేతాలు తెలుస్తాయి . తరచు జ్వరం వస్తుందంటే ఇది పట్టించుకోవలసిన సమస్యగా గుర్తించాలి . దీర్ఘకాలిక తలనొప్పి ,దాహం వేయటం ,వళ్ళు నొప్పులు ,ఏదైనా సరే మాటిమాటికి విసిగిస్తూ ఉంటే ఇంటి వైద్యంతో సరిపెడుతూ ఉంటారు . లేదా తెలిసిన మందుల షాపులో పాలనా రకంగా ఉంది అని మందులు తెచ్చేసుకుంటారు . కానీ ఇలాటివి సంకేతాలు రేపు శరీరాన్ని కుదిపేసే అనారోగ్యం కావచ్చు . సొంత వైద్యాలు చాలా సమస్య .
రికార్డులు ,మందులు
చాలామంది స్రీలు,పురుషులు కూడా ఆరోగ్యానికి సంసంధించి ఇంతకు ముందు వాడిన మందులు పరీక్షల వివరాలు వాడేస్తూ ఉంటారు . ఆరోగ్య సమస్యల్లో ఒకదానికి ఒకటి లింక్ గా ఉంటుంది . కొన్ని ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకోవాలి . ఒక కేస్ స్టడీలో పాతవివరాలు ఉపయోగ పడతాయి . అలాగే కొందరు ఆరోగ్య సమస్య కాస్త తగ్గిపోగానే మందులు ఆపేసారు . కానీ డాక్టర్ పద్దతిగా ఒక కోర్స్ లాగా మందులు వాడమంటారు . శరీరంలొంచి ,వైరస్ పూర్తిగా పోవాలంటే ఆ కోర్స్ మందులు వాడాలి . ఆలా మధ్య లో మానేస్తే మళ్ళి వైరస్ ఎటాక్ చేయచ్చు . అలాగే ఎంతోమంది కి వాడుతున్న మందుల గురించి ఎలాటి అవగాహనా ఉండదు . సైజ్ ,రంగులు బట్టి దేనికి గుర్తుపెట్టు కుంటారు ఏ మందు దేనికి పనికి వస్తుంది . దేనికి వాడుతున్నామో పేర్లు గుర్తు పెట్టుకొని పైన కవరు పైన రాసి పెట్టుకోవాలి పెట్టు కోవాలి . సరైన వేళలో సరిగ్గా చెప్పిన మోతాదులో మందు వేసుకోవాలి .

డాక్టర్ ను మార్చోద్దు
చాలా మందికి వెంటవెంటనే ఏ విషయంలో నైనా రిజల్ట్ కావాలి . ఆరోగ్య సమస్య కాస్త లైట్ తీసుకొనే విషయం . మంచి వైద్యం కాదంటూ వైద్యుడిని మార్చవద్దు . శరీరతత్వం అర్ధం చేసుకొనేందుకు సమయం తీసుకొని ,ప్రాథమిక అంచనా కావచ్చు ఆతర్వాత సరైన వైద్యం చేయగలుగుతారు డాక్టర్లు .

Leave a comment