ఆఫీస్ పని ఎంతో ఒత్తిడి ఉంటోందని దాంన్తో ఆరోగ్యం పాడై పోతుందని వింటూ ఉంటాం.కానీ నిజానికి ఆఫీస్ పని వల్ల ఒత్తిడితో ఆరోగ్యం చెడదనీ ,మనం సొంతంగా సృష్టించుకొన్న సమస్యల వల్లనే ఆరోగ్యం చెడుతుందనీ పరిశోధనల్లో తేలిన విషయం.ఆఫీసుల్లో బాగా పని చేసే వాళ్ళని ఏ ఆఫీస్ కూడా వదులుకోదు. కానీ పని వేళాల్లో ,పని పైన శ్రధ్ధ పెట్టక ,ఆఫీస్ లో ప్రమోషన్లపైన ,జీతం పెరుగుదలపైన అధికంగా శ్రద్ధ పెట్టడం వల్ల తమ పని సామార్థ్యాన్ని పొగొట్టుకుంటారు. ప్రమోషన్ దానంతట అది రావాలి,కానీ దాన్నీ గురించే ఆలోచించి ఆఫీస్ లో జరిగే ప్రతి అంశాన్ని మనసుకి దగ్గరగా తీసుకొని కుంగుబాటుతో ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అంటున్నారు అధ్యయనాకారులు.అంచేత ఎలాంటి అనవసరపు ఆవేశాలు ప్రదర్శించవద్దనీ, చక్కని పనితీరు కనబరిస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని ,ఏ ఒత్తిడినీ మనసులోకి తెచ్చుకోకుండా తేలిగ్గా పని చేసుకోమని అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment