Categories
ఈ కాలపు అమ్మాయిని నేను, స్వేచ్ఛగా పెరిగాను నాకు ఏం కావాలో తెలుసు . నా అవసరాలు నేనే తీర్చుకోగలను . అంతా ఒక పద్దతిలో నాకు అలవాటైన రీతిలో సాగుతుంది . ఇప్పుడు ఇంకో వ్యక్తి తో జీవితం పంచుకోవడం అంటే భయంగా ఉంటుంది . ఇన్నీ మాటలెందుకు నాకు పెళ్ళంటే భయం అంటోంది శృతి హాసన్ . పెళ్ళి గురించి నిర్భయంగా ఆలోచించే రోజు రావాలి . అప్పుడు ఒక మంచి వ్యక్తిని ఎంచుకోంటాను . ఎదుటి వ్యక్తి లో కరుణ,దయ,జాలి ఉండాలి . తెలివి ఉండాలి . నిజాయితీ పరుడైతే సంతోషిస్తాను . కాస్త గడ్డం పెంచుకొని హుందాగా ఉండే వ్యక్తిని నేను ఇష్టపడతాను అంటోంది శృతి హాసన్.