నేహరికా,

స్నేహితులతో కాసేపు బయటికి పోవడం, మనకున్న  కాస్త తీరిక సమయం స్పెండ్ చేయడం బాగానే వుంటుంది. కానీ చిన్న  విషయాల్లో డబ్బు  ఖర్చు పెట్టే విషయంలో తేడాలు రాకుండా చూసుకుంటే ఈ సరదా ఎల్లకాలం గడుస్తుంది. ముందుగా అందరు ఏ కాఫీ షాప్ లోనో కలిసారనుకో డబ్బు  గురించి పట్టించుకోకుండా  ఎవరో ఇచ్చేస్తారులే అనుకుంటే మనకు నష్టం. ఎవరో ఒకరు ఇస్తారు కదా మరి మనం కుడా ఇస్తేనే కదా ఆ స్నేహం బావుండేది. అలాగే ఎవరేనా మనల్ని  తోడుగా రమ్మంటే ఇక ఖర్చుల్ని వాళ్ళే పెట్టుకోవాలి అనుకుంటే కుడా తప్పే. అవతలి వ్యక్తి స్నేహితులైతే తోడుగా వెళ్ళినా ఖర్చుని మనం కొంత భరిస్తేనే బావుంటుంది. అలాగే ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే ముందే ఖర్చు  ఎంతో కొంత బడ్జెట్ వేసి సుమారు ఇంత అవొచ్చు  అనుకున్నది ముందే అందరికి దగ్గర కలక్ట్ చేసి ఒక్కల్లె డబ్బు  వాడేసి, ఎప్పటి కప్పుడు  ఖర్చులు ఓ పుస్తకంలో రాసేస్తే ఏ గొడవా వుండదు. పదిమందిలో జర్నీ  ఎంజాయ్ చేయొచ్చు . అసలు సరదా అంటే ఒకే వయస్సులో వుండే స్నేహితుల మధ్యనే వుంటుంది. చక్కగా ప్రణాళిక వేసుకుని, ఏ విషయం దగ్గర సమస్య  రాబోతుందో ముందే పసి గట్టి అక్కడ పారితోషకం చేసేసుకుంటే స్నేహితులు పదిలం ఏం అంటావ్!

Leave a comment