ఐర్లాండ్ లో క్యూంటెరో టివీ సీరియల్ మూడో సీజన్ షూటింగ్ లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. బాలల హక్కులపై యూనిసెఫ్ చేస్తున్న ప్రోగ్రాం కోసం ఇండియా వస్తుంది. తల్లి మధు చోప్రా కోసం కొన్నీ గంటలు కేటాయిస్తుంది. కెరీర్లో ఇంతింత పరుగులతో ఉన్న ప్రయాంక చోప్రా ఈ మధ్య ఒక ఇంటార్వులో మాట్లాడుతూ హీరోహీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో అసమానతలు ఎప్పుడూ ఉన్నాయి. ఇండియా అయినా ఆమెరికా అయినా సరే .అమెరికాలోని ఒక స్టూడియో ఆడిషన్ కోసం వెళితే నా వంటి ఛాయ ఆక్కడ స్టూడియో ఎగ్జిక్యూటర్ కు నచ్చలేదు .వాళ్ళకు బాహున ఛాయ ఉన్న వాళ్ళు నచ్చరు .ఎక్కడైన రంగు,జాతి,స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి అంటుంది ప్రియాంక. మరి ఆమె ఇలా చెపుతుంటే మిగతావాళ్ళ సంగతేమిటి?

Leave a comment