మహిళా న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌ ఇప్పుడు ఆసీఫా కోసం వాదిస్తుంది. జమ్మూలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలిక ఆసిఫాను గుడిలో దాచి అత్యాచారం చేసి కొట్టి చంపిన కేసులో దీపిక వాదిస్తుంది. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్‌ అసోషియేషన్‌లోని న్యాయవాదులు దాడులు చేశారు. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. దీపిక ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పోలీసుల రక్షణతో వారి సహాకారంతో కేసు విషయంలో ముందుకెళుతుంది.

Leave a comment