ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి అవకాశం అనుకుంటారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా. దీపికా పదుకునే కు ఈ అవకాశం దక్కింది. ప్రియాంక ఆస్కార్ వేడుకల్లో పాల్గొనటం రెండవసారి. మెరిసే వెండి రంగు దుస్తులతో ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక డ్రెస్ ను వేల మంది వీక్షకులు మంచి మార్కులే వేశారు. తర్వాత ఆఫ్టర్ పార్టీ లో నల్ల రంగు డ్రెస్ ల్లో కనబడింది. ఈ ఆఫ్టర్ పార్టీల్లో దీపికా ఫ్రిదా ప్రింట్లో కూడా సందడిచేసారు. 89 వ ఆస్కార్ పురస్కార వేడుక ఎంతో మంది నటుల కలల్ని సాకారం చేసింది. పురస్కారం తీసుకున్న వారి సంతోషాలు రెడ్ కార్పెట్ పైన నడిచిన అందాల రాణుల చిరునవ్వులతో పురస్కార వేడుక వెలిగి పోయింది. .

Leave a comment