మిస్ ఇండియా కిరీటం గెలిచిన వెంటనే తెలుగు నుంచి మంచి అవకాశలు వచ్చాయి. అప్పుడు సినిమాల పైన పెద్ద ఆసక్తిలేదు. కొన్నళ్ళపాటు మోడలింగ్ తర్వాత హిందీలో ఎన్నో అవకాశాలు, అక్కడ బిజీగా ఉన్నా గూఢచారిలో తెలుగులో నటించడం చాలా సంతోషం అనిపించింది అంటుంది శోభిత ధూలిపాళ. సంప్రదాయ తెలుగు కుటుంబం మాది. చదువే ప్రపంచంగా ఉండేదాన్ని గ్లామర్ ప్రపంచంలోకి వెళతానంటే ముందు ఇంట్లోవాళ్ళకు ఏ మాత్రం నచ్చలేదు. అందాల పోటి తర్వాత సినిమాలు,యాడ్స్ తో అవకాశాలు, ఇక ఇంట్లో అందరికీ ఈ ఫీల్డ్ నచ్చేసింది. హిందీలో ది బాడీ, ముధూన్,మెడ్ ఇన్ హెవెన్ చిత్రాల్లో నటిస్తున్నా. మాతృ భాషలో నటిస్తూ మటుకు చాలా ప్రత్యేకంగా ఫీలయ్యా అంటోంది శోభిత ధూళిపాళ.

Leave a comment