దేవాదాస్ సినిమాలో జహ్నావిగా కనిపించింది ఆకాంక్షా సింగ్. ఆమెది జైపూర్ .ఆమె తల్లి ,అక్కయ్యా రంగస్థల కళాకారులు. సినిమాల కంటే ముందు హిందీ సీరియల్స్ లో నటించింది. ఆమె నటి మాత్రమే కాదు చక్కని గాయని కూడా. సాధారణంగా సినిమాలోకి పెళ్ళాయ్యాక అమ్మాయిలు రావటం తక్కువే .ఆకాంక్ష నాలుగేళ్ళ క్రితమే తన చిరకాల మిత్రుడు కునాల్ సేన్ ను పెళ్ళి చేసుకొంది. అతను మార్కెటింగ్ రంగంలో ఉన్నాడు. సినిమాల్లోకి వచ్చాకానే నేను కలివిడిగా ఉండటం,మాట్లాడం,కామేడీ చేయడం నేర్చుకొన్నఅదివరకు అస్సలు చాలా ముక్తసరిగా మాట్లాడేదాన్ని అంటోంది ఆకాంక్షసింగ్ . ఆమె ఫిజియోథెరపిస్ట్. రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో చదువుకొని మొదటి ర్యాంగ్ సాధించింది ఆకాంక్ష.

Leave a comment